Care-Of-Kancharapalem movie image

Asha Pasham Telugu Mp3 Song Lyrics Care Of Kancharapalem

Asha Pasham Telugu Song Lyrics Details

Song Name: Asha Pasham Telugu Song Lyrics
Movie Name: Care Of Kancharapalem
Hero Name: Subba Rao, Mohan Bhagat
Heroin Name: Radha Besse
Singers Name: Anurag Kulkarni
Artists: Subba Rao, Radha Besse, Mohan Bhagat
Music Director: Sweekar Agasthi
Director: Venkatesh Maha
Song Type: Melody Song

Asha Pasham Song Lyrics In Telugu

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటే లే
తీరా తీరం సేరేలోగానే, ఏ తీరౌనో

సెరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో… తేలేలోగానే ఏదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోనా, సాగేనా

తూ రుత్తు త్తు తూ రూ రు రు
రూ రు రు రూ రు రు రూ రు రు రూ
ఏ లేలేలేలో… కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో… ఏ లీలో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం

దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
ఓ ఓఓ, ఆటు పోటు గుండె మాటుల్లోనా, సాగేనా

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటే లే
తీరా తీరం సేరేలోగానే, ఏ తీరౌనో

ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో… నీ శైలిలో

సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం

నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా

ఓ ఓఓ, ఆటు పోటు
గుండె మాటుల్లోన ఉంటున్నా
తేరా నానె నానే నానేనా
తేరా నానె నానే నానేనా
తారా తారా తారే రారారే తారా రారా
తేరా నానె నానే నానేనా
తేరా నానె నానే నానేనా
తారా తారా తారే రారారే తారా రారా

Asha Pasham Telugu Video Song

Asha Pasham Telugu Mp3 Song Play & Download

Asha Pasham Song Lyrics In English

Leave a Reply

Your email address will not be published.